కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఢిల్లీ : కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. జ్వరం, తల నొప్పి, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బంది, ఒంటి నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, విరోచనాలు, నీరసం తదితర లక్షణాలు కనిపిస్తే కోవిడ్ గా అనుమానించాలని సూచించింది. ఈ లక్షణాలు ఉన్న వారికి వెంటనే కరోనా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించింది. కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. కేసుల సంఖ్య పెరుగుతున్నందున టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించిన కేంద్రం.. ఆర్టీ పీసీఆర్ పరీక్ష ఫలితాలు ఆలస్యమవుతున్నందున ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా ర్యాపిడ్ టెస్ట్ బూత్ లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజలు స్వయంగా కరోనా టెస్టులు చేసుకునేలా సెల్ఫ్ టెస్ట్ లపై అవగాహన కల్పించాలని చెప్పింది.