లారీలు, ట్రక్కులను ఆపొద్దు

లారీలు, ట్రక్కులను ఆపొద్దు

రాష్ట్రాలకు కేంద్రం సూచన
అడ్డుకుంటే 1930కి కాల్​చేయండి
న్యూఢిల్లీ: నిత్యావసర సరుకుల రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. దేశ ఎకానమీ గాడిలో పెట్టేందుకు, నిత్యావసర వస్తువుల సరఫరా నిరాటంకంగా సాగేందుకు ఇంటర్–స్టేట్​హైవేల్లో ట్రక్కులు, గూడ్స్​కారియర్లను అడ్డుకోవద్దని రాష్ట్రాలు, యూనియన్​టెరిటరీలను హోమ్​మినిస్ట్రీ కోరింది. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ట్రక్కు, గూడ్స్​కారియర్ల ఆపరేటర్లు 1930 నెంబరుకు కాల్​చేసి కంప్లైంట్​ఇవ్వాలని హోం మినిస్ట్రీ జాయింట్​సెక్రెటరీ పుణ్య సలీల శ్రీవాస్తవ చెప్పారు.