తెలంగాణ గిరిజన వర్సిటీ బిల్లును తీసుకురానున్న కేంద్రం!

తెలంగాణ గిరిజన వర్సిటీ బిల్లును తీసుకురానున్న కేంద్రం!

తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని పార్లమెంటు బిజినెస్ బులెటిన్ లో వెల్లడించారు. ఈ సమావేశాల్లో మొత్తం 24 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.  తెలంగాణలో కేంద్ర గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఉద్దేశించిన కేంద్ర యూనివర్సిటీల సవరణ బిల్లు కూడా వీటిలో ఒకటని రాజ్యసభ  బులెటిన్ లోనూ తెలిపారు. విభజన చట్టంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని 8 ఏళ్లుగా రాష్ట్రం కోరుతోంది. కేంద్రం హామీ.. రేపట్నించి ప్రారంభం కానున్న పార్లమెంట్ సెషన్ లో నెరవేరబోతోంది.