
సాధారణంగా పెళ్లిళ్లలో లేదా ఏదైనా శుభకార్యాలలో సౌండ్ బాక్స్ లు పెట్టి సినిమా పాటలు ప్లే చేయడం మామూలే. ఇక పెళ్లి బారాత్ లలో అయితే వేళ వాట్స్ సౌండ్ సిస్టమ్స్, డీజేలు పెట్టి మరీ మోత మోగిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇలా ఫంక్షన్స్ లో సినిమా పాటలు వాడుకోవడం కాపీ రైట్స్ కిందకి వస్తుందని, అలా వాడినందుకు రాయాలిటీ పే చేయాలనీ డీపీఐఐటీ కి పిర్యాదులు అందాయట.
అయితే ఈ పిర్యాదులపై స్పందించిన కేంద్రం శుభకార్యాల్లో సినిమా పాటలను వాడుకోవడం కాపీ రైట్కిందకు రాదని స్పష్టం చేసింది. ఇక ఇదే విషయం స్పందించిన డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్, ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ).. రాయల్టీ వసూలు కాపీరైట్ చట్టం 1957 సెక్షన్ 52(1) స్ఫూర్తికి ఇది విరుద్ధమని, అలా కాదని ఎవరైనా రియాలిటీ డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచించింది.