హోటల్ నుంచి పార్సిల్ తెప్పించుకుని తింటుంటే.. 

హోటల్ నుంచి పార్సిల్ తెప్పించుకుని తింటుంటే.. 
  • సుల్తానాబాద్లో హోటల్​కు రూ. 5 వేల ఫైన్​ 

సుల్తానాబాద్, వెలుగు:  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ పట్టణంలోని ఓ టిఫిన్ సెంటర్ లో సోమవారం ఇడ్లీలో జెర్రీ కనిపించింది. సుల్తానాబాద్ లోని గడి మహల్ కు చెందిన జంగ రమ స్థానికంగా సంతలో కూరగాయలు అమ్ముతోంది. సోమవారం ఉదయం టిఫిన్ చేసేందుకు బస్టాండ్ ఎదురుగా ఉన్న రవీంద్ర టిఫిన్ సెంటర్ నుంచి ప్లేట్ ఇడ్లీని పార్సిల్​ తెప్పించుకుంది. ఇందులో నుంచి నాలుగు ఇడ్లీలు తిన్న తర్వాత ఐదో ఇడ్లీ తింటుండగా జెర్రీ కనిపించింది. వెంటనే భయంతో దవాఖానాకు పరుగులు తీసింది. విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మున్సిపల్ అధికారులు టిఫిన్ సెంటర్ ను తనిఖీ చేశారు. అపరిశుభ్రంగా ఉండడం, జెర్రీని గమనించకుండా ఇడ్లీలు అమ్మినందుకు యజమాని రవీందర్ కు రూ.5వేల ఫైన్​ వేశారు. మిగతా హోటళ్లలో దాడులు చేసి నాణ్యత లేని హోటల్స్​కు జరిమానాలు వేశారు.