హైదరాబాద్ సిటీ, వెలుగు: నవంబర్14న ‘మెగా వ్యవసాయ రుణాల’పై (అగ్రికల్చర్ లోన్ ప్రోగ్రాం ) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోన్ డిప్యూటీ జోనల్ హెడ్ ఎంవీఎస్ ప్రపాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలోని అన్ని శాఖల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ అవగాహన కార్యక్రమంలో అర్హులైన రైతులు, వ్యవసాయాధారిత వ్యాపారులకు వివిధ రుణాలకి సంబంధించిన పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి తక్షణమే రుణ మంజూరు పత్రాలు జారీ చేస్తామన్నారు.
రైతులు, వ్యవసాయాధారిత వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం మీ సమీప శాఖను సంప్రదించడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్ 1800 3030 కు కాల్ చేయవచ్చన్నారు.
