కేసీఆర్ అవినీతి బయటపడుతుందనే అడ్డుకుంటుర్రు

కేసీఆర్ అవినీతి బయటపడుతుందనే అడ్డుకుంటుర్రు

ప్రజాసంగ్రామ పాద‌యాత్రకు కేంద్ర బలగాలు కావాలని బండి సంజయ్ కోరారు. దీనిపై కేంద్రానికి లేఖ రాసిన ఆయన రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని పేర్కొన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆపే ప్రస‌క్తే లేదని.. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంగ్రామ‌ యాత్ర యాథావిధిగా భ్రద‌కాళి ఆల‌యం వ‌ర‌కు కొన‌సాగుతుందని తెలిపారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న పాద‌యాత్రను అడ్డుకోవ‌డం ప్రజాస్వామ్యానికే తీర‌ని మ‌చ్చ అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ వైఫ‌ల్యాల‌ను, అవినీతి అక్రమాల‌ను ఎండ‌గ‌డుతూనే ఉంటామని స్పష్టం చేశారు. 

పాద‌యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్న టీఆర్ఎస్ పై న్యాయ‌ప‌రంగా పోరాటం చేస్తామని బండి సంజ‌య్‌ తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబస‌భ్యులు అవినీతి అక్రమాలు బ‌య‌ట‌పెడుతున్నందుకే పాద‌యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పాద‌యాత్రకు భ‌ద్రత ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్‌ శాఖ‌దేనని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా శాంతియుతంగా గాంధేయ ప‌ద్ధతిలో త‌మ నిర‌స‌న‌ను వ్యక్తం చేయాల‌ని బీజేపీ శ్రేణుల‌కు ఆయన పిలుపునిచ్చారు.