PF News: పీఎఫ్ సభ్యులకు శుభవార్త.. వడ్డీ రేటులు ఫిక్స్, త్వరలో జమ..

PF News: పీఎఫ్ సభ్యులకు శుభవార్త.. వడ్డీ రేటులు ఫిక్స్, త్వరలో జమ..

PF Interest Rose: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్ సౌకర్యాన్ని సంస్థలు అందిస్తుంటాయి. ఉద్యోగులు రిటైల్ అయ్యిన తర్వాత వారికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో దీనిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి ఏటా కోట్ల మంది దాచుకున్న డబ్బుపై వడ్డీ రేటు ఎంత చెల్లించాలనే విషయం నిర్ణయించబడుతుంది.

ALSO READ | EPFO ​​New Rules: ఇకపై 5 కండిషన్స్ ఫాలో ఐతేనే PF డబ్బులు విత్‌డ్రా కుదురుద్ది..!

తాజాగా 2025 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ సభ్యులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ మెుత్తంపై 8.25 శాతం వడ్డీ రేటును అందించటానికి అంగీకారం తెలిపింది. అయితే దీనికి ముందు ఫిబ్రవరి 28న కేంద్ర ఈపీఎఫ్ కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించగా.. ప్రస్తుతం దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. దీంతో సభ్యుల ఖాతాల్లోకి అంగీకరించబడిన వడ్డీ మెుత్తం డిపాజిట్ చేయబడనుంది.

దీనికి ముందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా 8.25 శాతం చొప్పున వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక 2022-23 సంవత్సరంలో మాత్రం కొంచెం తక్కువగా 8.15 శాతం వద్ద వడ్డీ రేటు ఉంచబడింది. 2021-22 వడ్డీ రేటు 8.10 శాతంగా ఉంది. అయితే చివరిగా 2020-21లో మాత్రం పీఫ్ ఖాతాదారులు అత్యధికంగా 8.5 శాతం వడ్డీ రేటును అందుకున్నారు.