FSSAI : బాస్మతీ బియ్యం రంగు, రుచి, పరిమాణంపై ఆంక్షలు

FSSAI : బాస్మతీ బియ్యం రంగు, రుచి, పరిమాణంపై ఆంక్షలు

బాస్మతి బియ్యానికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. బిర్యానీ, పలావ్, ఫ్రైడ్ రైస్ ఇలా రైస్ ఐటెం ఏదైనా బాస్మతీ బియ్యంతో వండాల్సిందే. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక బాస్మతి బియ్యానికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొందరు అక్రమార్కులు కల్తీ, నాసిరకం బాస్మతి బియ్యాన్ని వాడుతున్నారు. ఈ కల్తీ మాఫియాని అరికట్టడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బియ్యం పొడవు, రుచి తదితర అంశాలపై నాణ్యతా ప్రమాణాలు రూపొందించింది. 

ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రమాణాలు దేశీయ మార్కెట్ తో పాటు విదేశీ ఎగుమతులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. బాస్మతీ బియ్యానికి ఆర్టిఫిషియల్ కలర్స్, వాసన, పాలిషింగ్ ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు ధాన్యం పరిమాణం సహజంగా 7 మిల్లీ మీటర్, వండిన తర్వాత పొడవు 12 మిల్లీ మీటర్ ఉండాలని సూచించింది. ఈ కొత్త రూల్స్ ను ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.