యూఏఈలో ఐపీఎల్‌కు ఓకే చెప్పిన కేంద్రం

యూఏఈలో ఐపీఎల్‌కు ఓకే చెప్పిన కేంద్రం

సూత్రప్రాయ ఆమోదం తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌‌ను యూఏఈలో నిర్వహించేందుకు సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ సూత్రప్రాయ ఆమోదం (ఇన్‌‌ప్రిన్సిపల్‌ ‌అప్రూవల్‌‌) తెలిపింది. ఈ మేరకు బీసీసీఐకి సమాచారం అందినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో ఎనిమిది ఫ్రాంచైజీలు లీగ్‌ ‌ప్రిపరేషన్స్‌‌ను వేగవంతం చేశాయి. ప్లేయర్లు, సపోర్ట్‌ స్టాఫ్‌‌కు కరోనా టెస్టింగ్‌ ప్రొటోకాల్స్‌‌తో పాటు క్వారంటైన్‌ ‌ఏర్పాట్లలో బిజీగా మారాయి. ‘ఐపీఎల్‌‌కు ఓకే చెబుతూ మాకు సెంట్రల్‌‌ నుంచి ఇన్‌‌ప్రిన్సిపల్‌ అప్రూవల్‌‌ వచ్చింది. ఇందుకు సంబంధించిన డ్యాకుమెంట్లు ఏ క్షణంలోనైనా రావొచ్చు. ఇక టోర్నీకి సంబంధించిన పనులను మరింత స్పీడప్‌‌ చేస్తున్నాం’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అయితే బీసీసీఐ చెప్పినట్లుగానే చాలా ఫ్రాంచైజీలు ఈనెల 20 తర్వాతే యూఏఈ వెళ్లేందుకు ప్లాన్ ‌చేసుకుంటున్నాయి. చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ మాత్రం 22న బయలుదేరేందుకు అన్ని రెడీ చేసుకుంటున్నది.

For More News..

మున్సిఫ్ చీఫ్ ఎడిటర్ ఖాన్ లతీఫ్ ఖాన్ మృతి

హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్‌కు కరోనా పాజిటివ్

2021 టీ20 వరల్డ్‌ కప్‌ ఇండియాలోనే