
హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్ష స్కీము కింద రాష్ట్రానికి రూ.1,487.76 కోట్లు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 15న ఢిల్లీలో పీఏబీ సమావేశం జరిగింది. 2025–26 విద్యాసంవత్సరానికి గానూ రాష్ట్రానికి 2వేల కోట్లు ఇవ్వాలని అధికారులు సమావేశంలో కోరారు. కానీ, గతేడాది కంటే నిధులు తగ్గించింది. 2024–25 సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం రూ.1,945 కోట్లు ఇచ్చేందుకు అంగీక రించింది.