మున్సిపాలిటీలకు కేంద్రం ఫండ్స్..జేహెచ్‌‌ఏ స్కీమ్‌‌ కిందరూ.51 కోట్ల విడుదలకు ఆమోదం

మున్సిపాలిటీలకు కేంద్రం ఫండ్స్..జేహెచ్‌‌ఏ స్కీమ్‌‌ కిందరూ.51 కోట్ల విడుదలకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు అర్బన్ లోక ల్ బాడీస్(యూఎల్బీ) అయిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు జల్ హీ అమ్రిత్(జేహెచ్ఏ) స్కీమ్‌‌కు సంబంధించి రూ.51.50 కోట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ టీకే శ్రీదేవి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. 45 సీవరేజ్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ ప్లాంట్స్‌‌ (ఎస్టీపీ)లకు రూ.51.50 కోట్లు ఇవ్వనున్నారు. వీటి లో మెజార్టీ నిధులు జీహెచ్ఎంసీ, జలమండలి పరిధి లో చేపట్టిన ఎస్టీపీ, యూజ్డ్ వాటర్ ట్రీట్‌‌మెంట్ ప్లాం ట్స్‌‌(యూడబ్ల్యూటీపీ)కు రూ.40.25 కోట్లు ఇవ్వనున్నారు. మిగిలిన మున్సిపాలిటీలకు రూ.11.25 కోట్లు అలాట్‌‌ చేయనున్నారు. 

అయితే, వీటిలో ఎస్టీపీ, యూడబ్ల్యూటీపీలకు రేటింగ్ ఆధారంగా నిధులు కేటాయిం చారు. సంబంధిత ఎస్టీపీ, యూడబ్ల్యూటీపీలో వినియోగించే టెక్నాలజీ ఆధారంగా రేటింగ్ ఇవ్వనున్నారని అధికారులు చెబుతున్నారు. కేంద్రం నిధులు ఇవ్వనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జీహెచ్‌‌ఎంసీ, కరీంనగర్, నిజామాబాద్, గ్రేటర్ వరంగల్, దేవరకొండ, గజ్వేల్, సిద్దిపేట, రామగుండం, సూర్యాపేట ఉన్నాయి. ఇందులో జీహెచ్‌‌ఎంసీలోనే 30 ఎస్టీపీలు నిర్మించనున్నారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగానికి రూ.11.23 కోట్లు ఇస్తూ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.