నీటివాటాల పంపిణీలో కేంద్రం ఫెయిల్: కేసీఆర్

నీటివాటాల పంపిణీలో కేంద్రం ఫెయిల్: కేసీఆర్

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 5 వద్దు: సీఎం కేసీఆర్

వచ్చే నెల 20 తర్వాత నిర్వహించేలా కేంద్రానికి లెటర్ రాయండి

అధికారులకు కేసీఆర్ ఆదేశం

 హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం నిర్వహించ తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ను వచ్చే నెల 20 తర్వాత పెట్టా లని సీఎం కేసీ ఆర్ కేంద్ర సర్కారును కోరారు. ముందే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ఉన్నందున, మరో తేదీన మీటింగ్ పెట్టేలా కేంద్రానికి లేఖ రాయాలని ఇరిగేషన్ ప్రిన్సి పల్ సెక్రెటరీని ఆదేశించారు. కేంద్ర జల శక్తి శాఖ ఆగస్టు 5న మీటింగ్ నిర్వహించనున్నట్టు ఇటీవలే లెటర్ రాసింది. దీనిపై సీఎం గురువారం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్షించారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి శాఖ తీరు హాస్యాస్పదంగా ఉందని కామెంట్ చేశారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్రం ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సంప్రదాయం ఉందని, ఈ విషయంలో కేంద్రం ఫెయిలైందని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు లేని పరిస్థితుల్లో నే కేంద్రం జోక్యం చేసుకొని పరిష్కరిం చాలని, వివాదాలుంటే ట్రిబ్యు నల్ మాత్రమే పరిష్కరిం చాల్సి ఉంటుందని అన్నారు.

చాలా వివాదాలున్నాయి

తెలంగాణ, ఏపీ మధ్య ముందు నుం చి వివాదాలు ఉన్నాయని, రాష్ట్ర విభజన చట్టం లోని సెక్షన్ 13 ప్రకారం వాటిని పరిష్కరిం చే బాధ్యతను ట్రిబ్యు నల్ కే అప్పగిం చాలని తెలంగాణ మొదటి నుంచీ కోరుతోం దని కేసీ ఆర్ పేర్కొన్నారు. తెలంగాణ విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెడుతూ వస్తోందని, జలశక్తి శాఖ తీరే సరిగా లేదని సీఎం మీటింగ్ లో పాల్గొన్న వారు అన్నారు.కేంద్రం తీరు వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యు నల్ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని పేర్కొన్నారు.

చుక్క నీటినీ వదలం

ఉమ్మడి ఏపీలోనే తెలంగాణ సాగునీటి రంగం అనేక కష్టనష్టాలకు గురైందని సీఎం పేర్కొన్నా రు. కృష్ణా, గోదావరి జలాల్లో హక్కు ను, నీటి వాటాను కాపాడుకొని తీరుతామన్నారు. ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఉమ్మడి ఏపీలో దగాపడ్డ మహబూబ్ నగర్, నల్గొం డ, రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరు అందించేం దుకు నిర్మిస్తున్న పాలమూరు, డిం డి లిఫ్ట్​ స్కీంలను త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. సమావేశంలో ప్లానిం గ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, రైతుబంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, చీఫ్ అడ్వైజర్ రాజీవ్ శర్మ పాల్గొన్నారు.