
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జులై 8 న మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాల పడతాయని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రెండు జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇవాళ (జులై 8) ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిమీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన అతిభారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది
జులై 8న అదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
జులై 9న ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిమీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. జులై 9న అదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్ ,నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.
ALSO READ : వర్షాలు పడుతున్నాయ్.. ఈ టైంలో వచ్చే రోగాలు ఇవి.. తినాల్సిన ఫుడ్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ..!
జులై 8, 9,10 న రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.