రాష్ట్రం అడిగిన వాటి కంటే ఎక్కువే ఇచ్చిన్రు

రాష్ట్రం అడిగిన వాటి కంటే ఎక్కువే ఇచ్చిన్రు

వెయ్యి అడిగితే రాష్ట్రానికి 1,400 వెంటిలేటర్స్ కేటాయింపు
జులై నెలాఖరుకు 1,175 అందజేసిన కేంద్రం
కరోనా కంటే ముందు గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఉన్నవి 192 మాత్రమే

హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఆర్థికసాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాని కంటే ఎక్కువగా వెంటిలేటర్లు, హైడ్రోక్లోరోక్విన్ ట్యాబ్లెట్స్, ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్లుసరఫరా చేస్తోంది. జులై 28 నాటికి కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలను పరిశీలిస్తే.. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణకే ఎక్కువగా ఎక్విప్మెంట్స్ సరఫరా చేసింది.

మహారాష్ట్ర , గుజరాత్ తర్వాత మనకే ఎక్కువ వెంటిలేటర్లు
కరోనా పేషెంట్ల కండిషన్ సీరియస్ అయితే.. వారి ప్రాణాలను కాపాడేందుకు వెంటిలేటర్లు చాలా కీలకం. ఐసీయూలో ట్రీట్మెంట్కు ఇవే ఆధారం. కరోనా కంటే ముందు మన రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్న మొత్తం వెంటిలేటర్లు 192 మాత్రమే. కరోనా విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కేంద్రం వెంటిలేటర్ల ఎగుమతిని నిలిపివేసి రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఈ క్రమంలోనే దేశంలో అత్యధికంగా 5.24 లక్షల పాజిటివ్ కేసులు దాటిన మహారాష్ట్రకు 3,463 వెంటిలేటర్లు పంపింది. 3 లక్షలకు పైగా కేసులున్న తమిళనాడుకు 568 వెంటిలేటర్లు, 2.35 లక్షల కేసులున్న ఆంధ్రప్రదేశ్ కు 570, కర్నాటక(1.78 లక్షల కేసులు)కు 710, ఢిల్లీ(1.46 లక్షల కేసులు)కు 525, ఉత్తర ప్రదేశ్(1.26 లక్షలు)కు 462 వెంటిలేటర్లను సరఫరా చేసింది. 71 వేల కేసులున్న గుజరాత్ కు 1,494 వెంటిలేటర్లు, 80 వేల పాజిటివ్ కేసులు ఉన్నతెలంగాణకు 1,400 వెంటిలేటర్లు కేటాయించి 1,175 అందజేసింది. మొత్తంగా మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత ఎక్కువగా వెంటిలేటర్లు తెలంగాణకే సరఫరా చేసినట్లు లెక్కలు చెబుతున్నయి. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి వెంటిలేటర్లు కావాలని మే నెలలో ప్రతిపాదనలు పంపితే అంతకంటే అదనంగా వెంటిలేటర్లను కేంద్రం పంపింది.

హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్స్, మాస్కులు, పీపీఈ కిట్స్ ఎక్కువే..
ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న వైద్యసిబ్బంది కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) ట్యాబ్లెట్స్, ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లను కూడా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం భారీగానే పంపింది. 4 నెలల కాలంలో తెలంగాణకు 42.5 లక్షల హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్స్, 10.09 లక్షల ఎన్ 95 మాస్కులు, 2.35 లక్షల పీపీఈ కిట్స్ సరఫరా చేసింది. మన కంటే మూడు రెట్లు అధికంగా కేసులు నమోదైన ఆంధ్రప్రదేశ్ కు 31.5 లక్షల హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్స్, 10.33 లక్షల ఎన్ –95 మాస్కులు, 2.79 లక్షల పీపీఈ కిట్లను సరఫరా చేసింది. జులై 28 నాటికి అన్ని రాష్ట్రాలకు 2.63 కోట్లకుపైగా ఎన్-95 మాస్కులు, 1.19 కోట్లకుపైగా పీపీఈ కిట్లు, 10.83 కోట్ల హెచ్‌సీక్యూ ట్యాబ్లెట్లను సప్లయ్ చేసింది.

For More News..

కోటీ 20 లక్షల ఎకరాల్లో పంటలు వేసిన్రు

అసెంబ్లీ ముందుకు ఇరిగేషన్ రీ ఆర్గనైజేషన్

ఓటర్ల లిస్ట్‌లో సవరణకు చాన్స్

రిమ్స్ వార్డుల్లో ఎలుకలు.. రోడ్ల మీద పేషంట్లు..