రష్మిక డీప్ఫేక్​ వీడియోపై.. కేంద్రం సీరియస్​ వార్నింగ్​

రష్మిక డీప్ఫేక్​ వీడియోపై.. కేంద్రం సీరియస్​ వార్నింగ్​

టాలీవుడ్​ నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ఫేక్​ వీడియో ఉదంతంపై కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్​లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కొందరు వ్యక్తులు ఆమె ఫొటోను ఏఐ టెక్నాలజీతో అశ్లీలంగా చేసి సోషల్​మీడియాలో రిలీజ్​ చేయడంతో అది వైరల్​గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటివి భయాందోళనకు గురిచేస్తున్నాయని దీనిపై అంతా కలిసి పోరాడాలని ఆమె పిలుపునిచ్చింది.

తాజాగా కేంద్రం ఈ అంశంపై స్పందిస్తూ..ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే ఇలాంటి కంటెంట్​ను ప్రోత్సహించరాదని సోషల్​మీడియా ప్లాట్​ఫాంలకు ఓ సర్క్యూలేషన్​ జారీ చేసింది. నిబంధనలు అతిక్రమించిన వారికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా ఉంటుందని అందులో పేర్కొంది.

రష్మికకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా మద్దతు తెలుపుతున్నారు. దీనిపై లీగల్​ కేసు నమోదు చేయాలని బాలీవుడ్​ నటుడు అమితాబ్​ బచ్చన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​ను కోరారు.

టెక్నాలజీ దుర్వినియోగాన్ని చూస్తుంటే భవిష్యత్తుపై భయం వేస్తోందని సినీ నటుడు నాగచైతన్య ఈ అంశపై స్పందించాడు. ఇంతమంది తనకు అండగా నిలవడంపై రష్మిక మందన్నా కృతజ్ఞతలు తెలిపింది.