వాక్సిన్​ కవచమే..కరోనాను రానివ్వట్లే

వాక్సిన్​ కవచమే..కరోనాను రానివ్వట్లే
  • పాజిటివ్ వచ్చే ఛాన్స్ తక్కువే
  • కోవాగ్జిన్ తీసుకున్నోళ్లలో పాజిటివ్ రేటు 0.04 శాతం
  • కోవిషీల్డ్ వేసుకున్నోళ్లలో పాజిటివ్ రేటు 0.03 శాతం

న్యూఢిల్లీ: వ్యాక్సిన్​ వేసుకున్నాక పాజిటివ్​ వస్తున్న కేసులు చాలా తక్కువేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొవాగ్జిన్​ సెకండ్​ డోస్​ తీసుకున్నోళ్లలో పాజటివ్​ రేటు కేవలం 0.04 శాతమేనని, కొవిషీల్డ్​ తీసుకున్న వారిలో 0.03 శాతంగా ఉందని పేర్కొంది. వ్యాక్సిన్​ తీసుకున్న 10 వేల మందిలో కేవలం ఇద్దరి నుంచి నలుగురికి మాత్రమే పాజిటివ్​ వస్తోందని ఐసీఎంఆర్​ డైరెక్టర్​ జనరల్​ బలరాం భార్గవ చెప్పారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా సోకినా దాని తీవ్రత మాత్రం చాలా తక్కువని నీతి ఆయోగ్​ మెంబర్​ డాక్టర్​ వీకే పాల్​ చెప్పారు. కరోనా ముప్పు ఎక్కువగా ఉండే హెల్త్​ సిబ్బందిలోనే వ్యాక్సిన్​ వేసుకున్నాక కరోనా సోకుతున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయని, సామాన్య జనం విషయంలో మాత్రం చాలా తక్కువేనని అన్నారు.