
న్యూఢిల్లీ: పాత వాహనాల వాడకాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 20 ఏండ్లు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజును కేంద్రం భారీగా పెంచింది. ఈ మేరకు రోడ్డు రవాణా, హైవేస్ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం.. 20 ఏండ్లు పైబడిన మోటార్ సైకిల్స్ కు రెన్యువల్ ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.2 వేలకు.. త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ కు రూ.3,500 నుంచి రూ.5 వేలకు పెంచారు. ఇంపోర్ట్ చేసుకున్న టూ లేదా త్రీవీలర్స్ కు రెన్యువల్ ఫీజును రూ.20 వేలకు ఫోర్, లేదా అంతకన్నా చక్రాలు ఉన్న వెహికల్స్కు రూ.80 వేలకు పెంచారు.