
- అత్యధికంగా పంజాబ్‌లో తర్వాత చత్తీస్గఢ్, తెలంగాణ
- తొమ్మిది, పది స్థానాల్లో పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర
- వానాకాలం సీజన్ కొనుగోళ్ల వివరాలు వెల్లడించిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: కేంద్రం ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 69 లక్షల టన్నుల వడ్లు కొన్నది. దేశవ్యాప్తంగా 6 కోట్ల 6 వేల టన్నుల ధాన్యం సేకరించింది. 77 లక్షల మంది రైతులకు మద్దతు ధర చెల్లించి రూ.1.18 లక్షల కోట్ల విలువైన ధాన్యం సేకరించింది. వడ్లు పండించే రాష్ట్రాల నుంచి ఎఫ్‌సీఐ ద్వారా కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ధాన్యం సేకరణ చేపట్టింది. జనవరి 23 నాటికే దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం కొన్నది. సోమవారం కేంద్రం ప్రకటించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు 77 లక్షల 640 మంది రైతులకు సంబంధించిన రూ.1,18,812.56 కోట్ల విలువైన 6,06,18,653 టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. ధాన్యం సేకరణలో పంజాబ్మొదటి స్థానం, చత్తీస్గఢ్ రెండో ప్లేస్, తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాయి. నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్, ఐదు హర్యానా, ఆరు మధ్యప్రదేశ్, ఏడు ఒడిశా, ఎనిమిది బిహార్, 9వ స్థానంలో ఏపీ, 10వ స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి.
రాష్ట్రం రైతులు కొన్నది (టన్నుల్లో) చెల్లించిన మొత్తం
పంజాబ్ 9,24,299 1,86,85,532 రూ.36,623.64 కోట్లు
చత్తీస్ గఢ్ 19,59,142 82,62,386 రూ.16,194.28 కోట్లు
తెలంగాణ 10,29,511 69,08,431 రూ.13,540.52 కోట్లు