అపోహలొద్దు.. ఏ వ్యాక్సిన్ అయినా వేసుకోవచ్చు

అపోహలొద్దు.. ఏ వ్యాక్సిన్  అయినా వేసుకోవచ్చు

కోవాక్జిన్, కోవిషీల్డ్ పనితీరుపై ప్రజల్లో కల్గుతోన్న అనుమానాలను నివృత్తి  చేసింది కేంద్రం. రెండు  వ్యాక్సిన్ల పనితీరులో ఎలాంటి తేడా లేదని ప్రకటించింది. రెండు వ్యాక్సిన్లు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ ప్రివెంట్ సివియర్ ఇల్ నెస్ గా పని చేస్తున్నాయని ప్రకటించింది. ఏది తీసుకోవాలనే అంశంపై సైంటిఫిక్ కంపారిజన్ లేదని వెల్లడించింది. రెండు వ్యాక్సిన్లు కరోనా నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పింది. వ్యాక్సిన్లపై వస్తున్న అపోహలొద్దని  సూచించింది. వ్యాక్సిన్ సెంటర్లో అందుబాటులో  ఉన్న వ్యాక్సిన్ ను వేసుకోవచ్చని చెప్పింది.