ఎన్డీఆర్ఎఫ్ కింద ఒక్క రూపాయి సాయం చేయలేదు

ఎన్డీఆర్ఎఫ్ కింద ఒక్క రూపాయి సాయం చేయలేదు

వరదసాయంపై కేంద్రం తీరును మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. భారీ వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ కింద ఒక్క పైసా సాయం చేయలేదని ఆరోపించారు. ప్రధాని మోడీజీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, కో ఆపరేటివ్ ఫెడరలిజం..? అంటే అర్థం ఇదేనా అని ప్రశ్నించారు. 2020లో హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు.. ఇప్పటి వరదలకు ఎందుకు సాయం అందించలేదని నిలదీశారు. దేశవ్యాప్తంగా 2018 నుంచి 2022 వరకు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా కేంద్రం అందించిన వరద సాయం వివరాలను ఆయన ట్వీట్ చేశారు