
మామిడి పండు అంటే చాలు.. జనాలకు నోరూరుతుంది. అందుకే ఏడాది అంతా ఉండే విధంగా మామిడికాయ పచ్చళ్లు పెట్టుకుంటారు. రైతులు చాలా రకాల మామిడి పండ్లను సాగు చేస్తుంటారు. చిన్న రసం.. పెద్దరసం.. బంగినపల్లి..తోతాపురి.. తెల్లగులాబీ... ఇలా చాలా రకాలున్నాయి. అయితే ఇప్పుడు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ (CISH), రహమాన్‌ఖేడా, లక్నో శాస్త్రవేత్తలు అవధ్ పేరుతో రెండు రకాల మామిడి పండ్లను అభివృద్ధి చేశారు. అందులో ఒకటి అవధ్ సమృద్ది.. మరొకటి అవధ్మధురిమ అనే కొత్త రకాల మామిడి వంగడాల గురించి తెలుసుకుందాం.
పండ్లలో రారాజు మామిడి పండ్లలో మరో రెండు రకాల జాతులను శాస్త్రవేత్తలు అభివృద్ది చేస్తున్నారు. అవద్ సమృద్ది..అవధ్మధురిమ ఈ రెండు జాతులను సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ (CISH), రహమాన్‌ఖేడా, లక్నో అభివృద్ధి చేసింది. ఈ పండ్లు గుజ్జు, తక్కువ పీచు కలిగి ఎంతో రుచిగా ఉంటాయని తెలిపారు. వీటి బరువు 350 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ALSO READ | తెలంగాణ కిచెన్ : దిల్ ఆకులతో చేసే కొన్ని వంటకాలు
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ తెలిపిన వివరాల ప్రకారం... అవధ్ సమృద్ధి రకానికి హైబ్రిడ్ మామిడి సాధారణ వాతావరణాన్ని తట్టుకోగలుగుతుంది. ఈ చెట్టు పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది. 15 ఏళ్ల చెట్టు ఎత్తు 15 నుంచి 20 అడుగుల వరకు ఉంటుంది.ఈ రకానికి చెందిన మామిడిపంట జూలై .-ఆగస్టు నెలలో పండించాలి. ఈ వంగడాన్ని త్వరలో విడుదల చేస్తామని జాతులను సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సబ్‌ట్రాపికల్ హార్టికల్చర్ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఏదైనా మామిడి రకం అభివృద్ధి చెందాలంటే దాదాపు రెండు దశాబ్దాలు పడుతుందని ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఆశిష్ యాదవ్ తెలిపారు. మొదటి దశలో ఇన్‌స్టిట్యూట్‌లో ట్రయల్ నిర్వహిస్తామని.. అక్కడ మంచి రిజల్ట్ వస్తే దేశంలోని పలు ప్రాంతాల్లోని ఇతర సంస్థలకు ట్రయిల్ కోసం పంపిస్తామన్నారు. అక్కడ చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వస్తే అప్పుడు ఆ జాతులకు చెందిన పంటలను మార్కెట్ లో విడుదల చేస్తారు.
భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ, పూసా (న్యూఢిల్లీ) పూసా అరుణిమ, పూసా సూర్య, పూసా ప్రతిభ, పూసా శ్రేష్ఠ, పూసా పితాంబర్, పూసా లలిమ, పూసా దీప్శిఖ, పూసా మనోహరి మొదలైన రకాలను అభివృద్ధి చేసింది.బెంగళూరులోని ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ ఆర్కా సుప్రభాత్, అర్కా అన్మోల్, అర్కా ఉదయ్, అర్కా పునీత్, అర్కా అరుణ, అర్కా నీలాచల్ కేసరి జాతులను అభివృద్ధి చేసింది.