
ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం 6గంటలపాటు మెక్రోసాఫ్ట్ సర్వర్ల డౌన్ అయ్యాయి. దీంతో ఎయిర్ పోర్ట్ లో విమానయానం, బ్యాంకింగ్ ట్రాన్ జాక్షన్స్, స్టాక్ ఎక్స్చేంజ్ యాక్టివిటీస్, పలు ఎమర్జెన్సీ సర్వీసులు నిలిచిపోయాయి. ఫ్లైట్లు క్యాన్సల్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ లో సమస్యలపై స్పందించారు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. ఆ కంపెనీ ప్రతినిదులతో కేంద్ర ప్రభుత్వం టచ్ లో ఉందన్నారు.
మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సమస్యను గుర్తించారని చెప్పారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందంటూ ట్వీట్ చేశారు అశ్వినీ వైష్ణవ్. మైక్రోసాఫ్ట్ లో ఏర్పడ్డ సమస్యతో.. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి సంస్థలకు ఎలాంటి ముప్పు లేదన్నారు.
సర్వీస్ పునరుద్ధరించడంలో పురోగతి సాధిస్తున్నామని, మల్లీ మైక్రోసాఫ్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని వారు తెలిపారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అయిన వన్ డ్రైవ్ లో 74 శాతం ప్రాబ్లమ్స్ వచ్చాయని డౌన్ డెటెక్టర్ తెలిపింది. ఇది ఒక ఆన్ లైన్ సర్వీస్ ప్రాబ్లమ్ ను ట్రాక్ కంపెనీ.