పాతబస్తీకి మెట్రో రైలును ఎందుకు విస్తరించడంలేదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) ప్రశ్నించారు. ఓల్డ్ సిటీ (Old City) అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులకు ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి సింధియా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సింధియా.. పాతబస్తీ సంక్షేమం - అభివృద్ధి బీజేపీ విధానమని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీని అభివృద్ధి చేసి చూపిస్తామని సింధియా హామీనిచ్చారు. భాగ్యలక్ష్మీ దేవాలయం చారిత్రాత్మకమైందని, అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
రోడ్లపై సింధియా సెటైర్...
భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లే సమయంలో రోడ్లపై సింధియా సెటైర్ వేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్ రోడ్లను చూసి తీవ్ర అసంతృప్తికి గురయ్యానన్న సింధఇయా కేవలం 10 నిమిషాల దూరానికి దాదాపు 30 నిమిషాలు పట్టిందని వాపోయారు రూ. 10వేల కోట్లతో వేయి కిలోమీటర్ల రోడ్లను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా వరద పోటెత్తడంతో వాహనాలు, ఇతరత్రా వస్తువులు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్లపై నిలిచిపోయిన నీళ్లను తోడేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నించారు.
आज हैदराबाद दौरे पर सड़कों की हालत देखकर निराशा हुई। 10 मिनट की दूरी तय करने में 30 मिनट लगते हैं।
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 29, 2022
₹10000 करोड़ की लागत से 1000 किमी लंबी सड़कों के निर्माण का राज्य सरकार द्वारा किया गया वादा कितने पानी में है, ये इस तस्वीर से साफ़ है। pic.twitter.com/gcWPoUwW67
