ముదిరాజ్లకు అండగా ఉంటాం.. అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముదిరాజ్లకు అండగా ఉంటాం.. అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పద్మారావునగర్, వెలుగు: ముదిరాజ్​లకు పూర్తిగా అండగా ఉంటామని, వారికి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి వెల్లడించారు. ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల్మండి నామాలగుండులో ముదిరాజ్​ల దసరా సమ్మేళనం అలయ్ బలయ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కిషన్​రెడ్డి హాజరై మాట్లాడారు. 

ముదిరాజ్​లకు చట్ట సభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ గౌరవం తప్పకుండా దక్కేవిధంగా తాము కృషి చేస్తామన్నారు. ముదిరాజ్​లు ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్​సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జగన్​మోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్​గౌడ్, నాయకులు మేకల సారంగపాణి, శంకర్, ఆకారం రమేశ్, మేకల హర్షకిరన్, లక్ష్మన్ తదిరతులు పాల్గొన్నారు.