సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌లో 9212 కానిస్టేబుల్‌‌‌‌ జాబ్స్​

సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌లో 9212 కానిస్టేబుల్‌‌‌‌ జాబ్స్​

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌‌‌‌పీఎఫ్) దేశవ్యాప్తంగా 9212  కానిస్టేబుల్‌‌‌‌(టెక్నికల్‌‌‌‌, ట్రేడ్స్‌‌‌‌మ్యాన్‌‌‌‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై పురుష/ మహిళా అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీలు : కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌‌‌‌మ్యాన్) విభాగంలో మొత్తం  9,212 (పురుషులకు 9105; మహిళలకు 107 ఖాళీలు ఉన్నాయి). పురుషులకు డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌‌‌‌మన్, బార్బర్, సఫాయి కర్మచారి పోస్టులు ఉన్నాయి. మహిళలకు బగ్లర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ ఉమెన్, హెయిర్ డ్రస్సెర్, సఫాయి కర్మచారి, బ్రాస్ బ్యాండ్ విభాగంలో  ఖాళీలు ఉన్నాయి.

అర్హత : పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన బోర్డు/ విశ్వవిద్యాలయం నుంచి పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, హెవీ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగిఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్ ​: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. 

ఎగ్జామ్​ ప్యాటర్న్ ​: సీబీటీ 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. హిందీ/ ఇంగ్లీష్‌‌‌‌ భాష(25 మార్కులు), జనరల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ రీజనింగ్‌‌‌‌(25 మార్కులు), జనరల్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌ అండ్‌‌‌‌ జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌(25 మార్కులు), ఎలిమెంటరీ మ్యాథ్స్‌‌‌‌(25 మార్కులు) అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్షకు రెండు గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 27 నుంచి ఏప్రిల్​ 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జులై 1 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.crpf.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.