పారిస్​ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌పై సెంట్రల్​ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ సమీక్ష

పారిస్​ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌పై సెంట్రల్​ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ సమీక్ష

న్యూఢిల్లీ: పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ సన్నాహాలపై కొత్తగా నియమితులైన సెంట్రల్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ మన్సుఖ్‌‌‌‌‌‌‌‌ మాండవియా గురువారం సమీక్ష నిర్వహించారు. గేమ్స్‌‌‌‌‌‌‌‌కు సమయం దగ్గరపడుతుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై ఐవోఏ చీఫ్‌‌‌‌‌‌‌‌ పీటీ ఉష మినిస్టర్‌‌‌‌‌‌‌‌కు వివరించింది. గంటకు పైగా సాగిన ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అయిన అథ్లెట్ల గురించి చర్చించారు. ‘నేను మొదటిసారి ఐవోఏ అధికారులతో సమావేశమయ్యా. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ సన్నాహాల గురించి వాళ్లు వివరించారు. 

అథ్లెట్లకు కావాల్సిన సౌకర్యాలు అందించేందుకు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ రెడీగా ఉంది. వీలైనన్ని పతకాలు గెలిచేలా క్రీడాకారులు కృషి చేయాలి’ అని మాండవియా పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో సాధించిన మెడల్స్‌‌‌‌‌‌‌‌ కంటే ఈసారి ఎక్కువగా తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఉష వెల్లడించింది. ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి రక్షా ఖడ్సే, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సుజాతా చతుర్వేది, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అథారిటీ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌ ప్రధాన్‌‌‌‌‌‌‌‌   పాల్గొన్నారు. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌కు ఇప్పటికే 97 మంది అర్హత సాధించారు.