తెలంగాణకు వైద్య, విద్య, ఆరోగ్యానికి నిధులిచ్చాం

తెలంగాణకు వైద్య, విద్య, ఆరోగ్యానికి నిధులిచ్చాం
  • ఎంపీ కావ్య ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్‌‌ హెల్త్‌‌ మిషన్‌‌ (ఎన్‌‌హెచ్‌‌ఎం) కింద 2024-–25లో తెలంగాణకు రూ.67.16 కోట్లు, ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రూ.208.82 కోట్లు కేటాయించి నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు శుక్రవా రం లోక్‌‌సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. 

కేంద్ర పథకం కింద తెలంగాణలోని 9 మెడికల్ కాలేజీలకు 511 పీజీ సీట్లు మంజూరయ్యాయని తెలిపారు. వరంగల్‌‌ కాకతీయ మెడికల్ కాలేజీకి 92 సీట్లకు గాను మొదటి దశలో 89 సీట్లకు రూ.7.47 కోట్లు, రెండో దశలో 3 సీట్లకు రూ.2.15 కోట్లు విడుదల చేశామని చెప్పారు.