పార్లమెంట్‌‌లో ప్రశ్నోత్తరాలు పీఎంకేవై ద్వారా పెద్దపల్లి జిల్లాకు 48 కోట్లు

పార్లమెంట్‌‌లో ప్రశ్నోత్తరాలు పీఎంకేవై ద్వారా పెద్దపల్లి జిల్లాకు 48  కోట్లు
  • ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధానమంత్రి కిసాన్‌‌ యోజ న(పీఎం కేవై) స్కీమ్ కింద పెద్దపల్లి జిల్లాల్లోని లబ్ధిదారులకు రూ.48.79 కోట్లు పంపిణీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 4 వ తేదీ నాటికి వివిధ వాయిదాల్లో ఈ మొత్తాన్ని డైర్టెక్ట్ బెనిఫిట్‌‌ ట్రాన్స్‌‌ఫర్‌‌(డీబీటీ) ద్వారా అందజేసినట్టు స్పష్టం చేసింది.

ఈ మేరకు మంగళవా రం లోక్​సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌‌సింగ్‌‌ చౌహాన్‌‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. పీఎంకేవై ప్రారంభమైననాటి నుంచి కేంద్ర ప్రభుత్వం 20 విడతల్లో మొత్తం రూ.3.90 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసినట్టు సమాధానంలో వెల్లడించారు.తెలంగాణకు ఆయిల్‌‌ పామ్‌‌పరిశోధనా కేంద్రం ఇవ్వలేం

తెలంగాణలో ఆయిల్‌‌ పామ్‌‌ పరిశోధన కేం ద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభ్యర్థి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇందుకు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పింది.  ఏపీలోని పెదవేగిలో గల ఇండియన్‌‌ ఇన్​స్టి ట్యూట్‌‌ ఆఫ్‌‌ ఆయిల్‌‌ పామ్‌‌ రీసెర్చ్‌‌ (ఐఐఓపీఆర్‌‌) తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల ఆయిల్‌‌ పామ్‌‌ పెంపకందారుల అన్ని రకాల అవసరాలు తీర్చుతున్నన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది‌‌. ఈ మేరకు మంగళవా రం ఎంపీ చామల కిరణ్‌‌ కుమార్‌‌ రెడ్డి ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహా య మంత్రి భగీరథ్‌‌ చౌదరి రాతతపూర్వక సమా ధానం ఇచ్చారు.  

పరికిబండలో రూ.1,775 కోట్లతో ఎంఎంఎల్‌‌పీ పార్కు: కేంద్రం

రాష్ట్రంలో మల్టీ మోడల్‌‌ లాజిస్టిక్స్‌‌ పార్కుల అభివృద్ధికి తెలంగాణ ట్రేడ్‌‌ ప్రమోషన్‌‌ కార్పొరేషన్‌‌ ద్వారా మెదక్‌‌ జిల్లా మనోహరాబాద్‌‌ మండలం పరికిబండలో 300 ఎకరాల భూమిని గుర్తించామని కేంద్రం పేర్కొంది. ప్రాజెక్టుకు అంచనా వ్యయం సుమారు రూ.1,775 కోట్లుగా ఉందని.. అయితే, సెజ్​ఏర్పాటుకు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని ఎంపీ బలరాం నాయక్ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితిన్‌‌ సమాధానం ఇచ్చారు.