మహా భారత రత్నాలు

మహా భారత రత్నాలు

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మన తెలంగాణ ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు,  బిహార్‌‌‌‌‌‌‌‌ మాజీ ముఖ్యమంత్రి జననాయక్‌‌‌‌‌‌‌‌ కర్పూరీ ఠాకూర్‌‌‌‌‌‌‌‌కు, బీజేపీ అగ్రనేత లాల్‌‌‌‌‌‌‌‌కృష్ణ అద్వానీకి,  ఎమ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ స్వామినాథన్‌‌‌‌‌‌‌‌కు, చౌదరి చరణ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌కు, భారతరత్నలు ప్రకటించడం భారత రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చరిత్రలో ఒక మహోన్నత ఘట్టంగా భావించవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థంగా నడిపిన గొప్ప పాలనాదక్షుడు ఒకరైతే,   ఇంకొకరు సామాజిక నైతిక భావనను రాజకీయాలకు జోడించారు. మరొకరు భారత సాంస్కృతిక విధానాన్ని రాజకీయాలకు జోడించినవారు. మరొకరు రైతును రాజకీయాల్లో నిలబెట్టిన నాయకుడు. దేశంలో హరిత విప్లవాన్ని సాధించిన గొప్పవ్యక్తి మరొకరు. వీరంతా భారతరత్నలు పొందటం భారత జాతికి గర్వకారణం. రాజకీయంగా ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా మోదీ ప్రభుత్వం చేసిన ఈ నిర్ణయం సర్వజనామోదం.

తెలుగు జాతి ముద్దు బిడ్డ, అపార మేధోసంపత్తి కలిగి దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన పీవీ నరసింహరావుకు భారత రత్న ఇచ్చి మోదీ ప్రభుత్వం మరోసారి కాంగ్రెస్​ను దెబ్బకొట్టింది. మైనార్టీలో ఉండి కూడా ఐదేళ్లు కేంద్రం ప్రభుత్వాన్ని నడిపిన పీవీ.. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బహు భాషా పండితుడైన పీవీ.. విశ్వనాథ సత్యనారాయన నవల వేయిపడగలును సహస్ర ఫణ్​గా అనువదించి తనకు భారత సాంస్కృతిక జీవనం పట్ల ఉన్న మక్కువ తెలియజేశాడు. గొల్ల రామవ్వ కథను రాసి రజాకార్​ మనస్తత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలిపాడు. అయితే కేంద్రంలో దక్షిణ భారతం నుంచి ప్రధానమంత్రిగా, అదీ కాంగ్రెస్​ పార్టీ నుంచి అంటే సులభం కాదు. అదీకాక నెహ్రూ కుటుంబయేతర కాంగ్రెస్​ ప్రధానిగా పీవీ ఢిల్లీలో నిలబడటం అంత ఆషామాషీ కాదు. 

దేశానికి రాజైనా తల్లికి బిడ్డనే

పీవీ నరసింహరావు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రాజనీతిజ్ఞుడు. బహుభాషా కోవిదుడు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక నిర్ణయాలు తీసుకొని చరిత్ర కెక్కారు. భూ సంస్కరణలు తెచ్చి అబ్బురపరిచారు. స్వతహాగా తన భూమినే ప్రజలకు పంచిపెట్టారు. రాజకీయ జీవితంలో శిఖరాగ్రపదవి వరకూ చేరుకోగలిగారంటే, పీవీలో ఉన్న పాలనా సమర్థతే కారణం.  అనుకోని సమయంలో దేశానికి ప్రధాని అయ్యాడు. ఆర్థికంగా దేశం ఆగమవుతున్న సమయంలో నూతన ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన చరిత్ర మరువని గొప్ప నాయకుడు. ఇందిరాగాంధీ హయంలో దాదాపు ఈ దేశ కీలక మంత్రిత్వ శాఖలన్నిటినీ నడిపిన మంత్రిగా ఆయనకు ఉన్న  పాలనా అనుభవాలు బహుశా మరెవరికీ లేకపోవచ్చు.

ఆ అనుభవాలే  ఆయనను ఈ దేశ ప్రధానమంత్రి పదవికి అర్హుణ్ణి చేశాయి.  దేశానికి రాజునైనా, ఒక తల్లికి బిడ్డనే అనే విషయాన్ని  పీవీ పదే పదే చెప్పేవారు. పీవీలో ఉన్న వినమ్రతకు అదొక నిదర్శనంగా నిలిచిపోయింది. దేశానికి ప్రధానిని అయినా  తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డనే అనే స్ఫురణ ఆయనలో నిరంతరం ఉండేది.  విదేశాంగ, ఆర్థికశాఖలను ఒకప్పుడు అద్భుతంగా  నడిపిన పీవీలో అపార పాలనా అనుభవం.. ఈ దేశం ఆర్థిక ఆపదలో ఉన్నపుడు బాగా ఉపయోగపడింది. దేశానికి నడిచొచ్చే కొడుకులాగ ప్రధాని పదవికి దొరికాడు. దేశాన్ని ఆర్థిక ఒడుదొడుకుల నుంచి కాపాడి నిలబెట్టాడు.

రాజకీయ దురంధరుడికి అనేక కష్టాలు, అవమానాలు తప్పలేదు

మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు సమర్థంగా నడిపిన పీవీ రాజకీయ ప్రజ్ఞ అపారమైంది. అది దేశానికి ఉపయోగపడింది. పార్టీ పరంగా కాంగ్రెస్​ను సజీవంగా నిలబెట్టగలిగాడు. జీవితాంతం కాంగ్రెస్​కు సేవ చేసి చివరి దశలో యూపీఏ ప్రభుత్వం వల్ల అవమానం పడ్డాడని పీవీ నరసింహరావు గురించి చెబుతూ ఉంటారు. దేశ ప్రధానమంత్రి ఢిల్లీలో సమాధి స్థలాలు ఉన్న అత్యంత అవమానకరంగా కాంగ్రెస్ పార్టీ తన కార్యాలయంలో కూడా పెట్టకుండా పీవీ నరసింహరావు పార్థివ దేహాన్ని హైదరాబాద్ పంపించారని అందరూ చెప్పుకునే మాటే. ఇదే మాటను నరేంద్ర మోదీతో సహా  కాంగ్రెస్ ను టార్గెట్ చేసి చెబుతుంటారు. దానికి తోడు పీవీ నరసింహరావు లోలోపల హిందుత్వవాది అని చాలామంది సెక్యులర్ నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. పీవీ నరసింహరావుకు ఢిల్లీలో అంతర్గతంగా వాజ్​పేయి, అద్వానీ అండ ఉండేదని రాజకీయ వర్గాలు చెప్తుంటారు. 

అయోధ్య అపవాదు

ఎందుకంటే పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నప్పుడే అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కరసేవకులు కూల్చారని వివిధ ముస్లిం సంస్థలు సెక్యులర్ నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, అర్జున్ సింగ్ వంటి హేమా హేమీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు మాత్రమే అప్పగించిన ప్రధాని పదవి కాలంలో ఈ సంఘటన జరిగిందని దానివల్ల ముస్లింలు కాంగ్రెస్ కు దూరం అయ్యారని సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని అనేకమంది తమ జీవిత చరిత్ర ల్లో వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ మోదీ ప్రభుత్వం పీవీ నరసింహరావు భారతరత్న ప్రకటించి, అటు దక్షిణ భారతదేశంలో తమకు కమిట్మెంట్ ఉందని చెప్పడం.. కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడం... తెలుగు రాష్ట్రాల ప్రజల కోరికతోపాటు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల కోరికను మన్నించడం వంటి త్రిశూల వ్యూహానికి తెరదీసింది. 

మైనారిటీ ప్రభుత్వం నడపడం అసాధారణం

నిజానికి పీవీ నడిపింది మైనారిటీ ప్రభుత్వం. అప్పట్లో దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల వల్ల, ప్రతిపక్షాల పరోక్ష సహకారం వల్ల కూడా పీవీ మైనారిటీ ప్రభుత్వం పూర్తి కాలం నడపగలిగిందని రాజకీయ పండితులు చెపుతుంటారు. అందులో నిజం కూడా ఉంది. ప్రతిపక్షాలు అవసరమైనపుడు పీవీ ప్రభుత్వాన్ని విమర్శించడం, అదే సమయంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి దాకా లాగక పోవడం అప్పట్లో ముఖ్యంగా బీజేపీ అనుసరించిన ద్విముఖ వ్యూహమని కూడా అంటుంటారు.  దేశంలో రాజకీయ అస్థిరత తలెత్తకూండా తన రాజనీతిజ్ఞతతో ప్రభుత్వాన్ని నడిపిన గొప్ప ప్రధానిగా పీవీ భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోయారు. భారత రాజకీయాల్లో పీవీ లాంటి నాయకుడు చాలా అరుదు. అదీనూ ఆయన మన తెలంగాణ బిడ్డ కావడం, ఆయనకు ఇవాళ మోదీ ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించడం దేశ ప్రజలందరూ హర్షించదగ్గ విషయం.  ఒకప్పుడు ఆపదలో ఉన్న దేశాన్ని సమర్థంగా  నడిపిన నాయకుడికి ఆలస్యంగానైనా  అత్యున్నత పురస్కారం లభించడం  అభినందనీయం.  

దేశ విభజన తరువాత కట్టుబట్టలతో భారత్‌‌‌‌‌‌‌‌కు వచ్చి, రాజకీయాల్లో అంటరానితనం ఎదుర్కొని రథయాత్ర ద్వారా ఈరోజు భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉండేటట్లు చేయగలిగిన సామర్థ్యం అద్వానీది.స్వాతంత్ర్యం వచ్చాక సోమనాథ్‌‌‌‌‌‌‌‌ ఆలయం సమస్య అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌‌‌‌‌‌‌‌ బాబూరాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌, అప్పటి హోంమంత్రి సర్దార్‌‌‌‌‌‌‌‌ వల్లభాయ్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌,  కెఎం మున్షీ వంటివారి చొరవతో పరిష్కారం అయింది. కానీ, మిగతా ఆలయాల సమస్యలు అలాగే ఉండిపోయాయి. 1983లో షహబానో తీర్పును రద్దు చేస్తూ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో రాజీవ్‌‌‌‌‌‌‌‌గాంధీ ప్రభుత్వం చేసిన తప్పు, ముస్లిం పర్సనల్‌‌‌‌‌‌‌‌ లా బోర్డు బ్లాక్‌‌‌‌‌‌‌‌మెయిలింగ్‌‌‌‌‌‌‌‌ మరోసారి హిందూ సమాజంలో కలకలం రేపింది. దేశంలో ‘హిందూ చైతన్యం’ ఆవశ్యకత మరోసారి ముందుకు వచ్చింది.

 సెక్యులరిజం పేరుతో హిందూ వ్యతిరేక భావాన్ని రెచ్చగొడుతున్న కుహనా రాజకీయ పక్షాల గుట్టు బట్టబయలు చేసేందుకు కశ్మీర్‌‌‌‌‌‌‌‌, పంజాబ్‌‌‌‌‌‌‌‌, అస్సాం సమస్యలపై కఠిన వైఖరి అవలంబించాల్సిన అవసరాన్ని గురించి, ఆర్టికల్‌‌‌‌‌‌‌‌ 370 రద్దు, ఉమ్మడి పౌరసత్వ చట్టం అవసరం, మానవ హక్కుల సంఘం ఏర్పాటు తదితర ఏర్పాట్లపై పార్టీ వైఖరిని తెలియజేస్తూ దేశ ప్రజలను జాగృతం చేయడానికి బీజేపీ అధ్యక్షుడు ఎల్‌‌‌‌‌‌‌‌కె అద్వానీ 1990లో రథయాత్ర నిర్వహించతలపెట్టారు.  అద్వానీ చేపట్టిన ఈ రథయాత్ర తూర్పు-పడమరలు, ఉత్తర- దక్షిణాలను ఒక్కటి చేసింది. అంటే దేశాన్ని ఒక్కటి చేసిందన్నమాట. ఇది కేవలం రామమందిరం కోసమే జరగలేదు. అలాగే సంతుష్టీకరణ ఆధారంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న 'ఉగ్రవాద ఉద్యమాలాను ప్రశ్నించింది. హిందూ సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పింది.

సరికొత్త రాజకీయ పవనాలు

అద్వానీ సోమనాథ్‌‌‌‌‌‌‌‌ నుంచి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర దేశంలో సరికొత్త రాజకీయ పవనాలను వీచేటట్లు చేసింది. ఈ సందర్భంలో అద్వానీ చెప్పిన ఉదాహరణ చాలా గొప్పది. 'పోలెండ్‌‌‌‌‌‌‌‌లోని వార్సా నగరాన్ని రష్యా తొలిసారి ఆక్రమించుకున్నపుడు (1614--–1915) రష్యన్లు వార్సాలోని ప్రధాన కూడలిలో ఒక ఈస్ట్రన్‌‌‌‌‌‌‌‌ ఆర్థడాక్స్‌‌‌‌‌‌‌‌ క్రిస్టియన్‌‌‌‌‌‌‌‌ కేథడ్రల్‌‌‌‌‌‌‌‌ నిర్మించారు. 1918లో పోలెండు స్వాతంత్ర్యం పొందాక ఆ దేశ ప్రజలు ఈ కేథడ్రల్‌‌‌‌‌‌‌‌ను కూల్చేశారు. ఎందుకంటే రష్యన్లు దాన్ని మతపరమైన కారణాలతో కాకుండా రాజకీయ కారణాలతో నిర్మించారని పోలెండు ప్రజలు భావించారు. కానీ మా వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటుంది. మేం గౌరవంగా బాబ్రీకట్టడాన్ని తరలిస్తామని నేను చెప్పాను” (నా దేశం-- నాజీవితం పుట 309). ఆనాడు అద్వానీ చెప్పినదానిలో మొదటిది ఈరోజు జరిగింది. నాడు దేశంలో తమను తాము సెక్యులర్‌‌‌‌‌‌‌‌లుగా అతిగా ఊహించుకున్న నాయకులు, కమ్యూనిస్టులు, అద్వానీ రథయాత్రను దుస్సంఘటనగా చూపించారు.

కానీ ఇదే రథయాత్ర దేశంలో మరో సుదీర్ఘ జాతీయోద్యమానికి నాంది పలికింది. ఒక ప్రతినిధి బృందంతో ప్రభుత్వం తరపున లండన్‌‌‌‌‌‌‌‌ వెళ్ళిన అద్వానీ  ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “భారతదేశంలో గతంలో ఎన్నడూ జరుగని విధంగా రామజన్మభూమి ఉద్యమం జరగబోతోందని” చెప్పారు. అది సహజంగా తమ పార్టీ స్టాండ్‌‌‌‌‌‌‌‌లా చెప్పిన మాటలే కానీ భారత పత్రికలన్నీ ఆ విషయాన్ని హెడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌గా రాశాయి. ఆ తర్వాత ముస్లిం పర్సనల్‌‌‌‌‌‌‌‌ లాబోర్డ్​ దాన్ని  గొడవగా మార్చేసింది. “గతంలో జరిపిన దాడి నుంచి ఒక పవిత్రమైన హిందూ ప్రదేశాన్ని కేవలం తిరిగి స్వాధీన పరచుకోవడంతోనే ఈ ఉద్యమం పరిమితం కాకూడదని భావించాను. కుహనా లౌకికవాదం దాడి నుంచి లౌకికవాదాన్ని వాస్తవరూపంలో ప్రకటించడానికి ఈ ఉద్యమంతో ద్బఢమవ్వాలని భావించాను” అని అద్వానీ తన జీవిత చరిత్రలో 'నా దేశం నా జీవితం” (పుట 310) లో రాసుకున్నారు.  రాజకీయ అస్థిరతను పారదోలడంలో అద్వానీ సేవలు దేశానికి ఉపయోగపడ్డాయి. అటు సాంస్కృతిక జాతీయవాదాన్ని బలోపేతం చేశారు. ఇటు దేశంలో రాజకీయ సుస్థిరతకు పునాదులు వేశారు.

దేశ సేవలకు గౌరవం

ఇవన్నీ మహా భారత రత్నాలు... గతంలో  పద్మ అవార్డులు పేరు మోసిన కవులు కళాకారులు రాజకీయ నాయకులు మాత్రమే పొందుతారని ఒక  అపప్రథ ఉండేది. ఇటీవల వస్తున్న అవార్డులు మొత్తం భారతదేశానికి ఒక ఉపశమనమే అని చెప్పొచ్చు. కర్పూరీఠాకూర్, లాల్ కృష్ణ అద్వానీ, పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్  వంటి వ్యక్తులకు భారతరత్న ఇవ్వడం వల్ల సరికొత్త సందేశం భారత రాజకీయ వర్గాలకు,  వెళ్లిందని చెప్పవచ్చు. నూతన వ్యవసాయ విధానం రూపకర్త ఎమ్మెస్ స్వామినాథన్ లాంటి శాస్త్రవేత్తలకు ఇవ్వడం వల్ల మేధోవర్గాన్ని గౌరవించినట్లు అయింది.

భారతరత్న పొందిన బిహార్​ దిగ్గజ నేత కర్పూరీ ఠాకూర్​ జీవితం ఆదర్శప్రాయమైంది. భారత రాజకీయ రంగంలో ఎవరూ వ్యతిరేకించలేని సమున్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. సోషల్​ఇంజినీరింగ్​ గురించి మాట్లాడుతున్న ఈ కాలంలో గుర్తు తెచ్చుకోవలసిన రాజకీయ నేత కర్పూరీ ఠాకూర్. బడుగు వర్గాల్లో కూడా అత్యంత వెనుకబడిన ‘నాయీ’ కులంలో పుట్టి ఆదర్శ, నైతిక రాజకీయ జీవితం గడిపిన ఠాకూర్​కు మోదీ ప్రభుత్వం చేసిన ఈ పట్టాభిషేకం ఇప్పటి సరికొత్త రాజకీయ కథనమే అనవచ్చు. కాంగ్రెస్​ తప్ప ఈ దేశానికి ప్రత్యామ్నాయం లేదనుకుంటున్న కాలంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చి 1970 డిసెంబర్​ నుంచి 1971 జూన్​ వరకు బిహార్​ గద్దెపై కాంగ్రెసేతర సీఎంగా పదవిని అలంకరించారు. మళ్లీ 1977 నుంచి 1979 వరకు రెండోసారి సీఎంగా పదవిని అధిష్టించారు.  ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టాలని, సామాజిక న్యాయం నైతికతతో కూడి నడిపించాలన్న స్పృహ కర్పూరీ ఠాకూర్​కు లక్ష్యంగా లక్షణంగా కన్పిస్తాయి. ‘బీద, అణచివేతకుగురైన, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేశారు’. అని భారతరత్న ప్రకటించిన రోజు నరేంద్ర మోదీ ప్రకటించారు. 

రాజకీయ నేతల్లో నైతిక స్వరూపం

తన కుమార్తె పెండ్లికి తను వ్యక్తిగతంగా దాచుకున్న డబ్బును ఉపయోగించి చేయడం ఈ కాలంలో వింతగా అనిపించవచ్చు. తాను బిహార్​ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయ నాయకుల కోసం నిర్మించిన కాలనీలో తాను సెంటు స్థలం కూడా తీసుకోలేదు. 1977లో బిహార్​లో తన ఆధ్వర్యంలో జనతా ప్రభుత్వం నడుస్తోంది. అదే సమయంలో లోక్​నాయక్​ జయప్రకాశ్​ నారాయణ్​ జన్మదిన వేడుక కోసం నాయకులంతా పాట్నాలో సమావేశం జరిపారట. అప్పుడు చినిగిపోయిన కోటు తొడుక్కున్న కర్పూరీ ఠాకూర్​ను చూసిన చంద్రశేఖర్​ అప్పుడే కొంత విరాళం సేకరించి ఇస్తే ఆ డబ్బునూ సీఎం రిలీఫ్​ ఫండ్​కు జమచేసిన గొప్ప వ్యక్తి అని నరేంద్రమోదీ గుర్తుచేసుకున్నారు. ఆఖరుకు 1988లో ఆయన మరణించిన సమయంలో వారి స్వగ్రామానికి వెళ్లిన నాయకులు ఆయన చిన్న ఇంటిని అక్కడ వ్యవస్థను చూసి ఘొల్లున ఏడ్చారట. ఇలాంటి జీవితాలు మనకు ఎవరు నేర్పించాలి? గ్రామస్థాయి పదవి పొందిన వారే కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఈ కాలంలో ఇలాంటి నిరాడంబరమూర్తి జీవితం మన రాజకీయాలకు ఆదర్శం ఎలా? నిజానికి కర్పూరీ ఠాకూర్​కు భారతరత్న కిరీటం ధరింపజేసిందువల్లనైనా చరిత్రలో ఇలాంటి వ్యక్తి ఉండేవారని తెలిసింది. 

ఆ కాలంలోనే ‘కర్పూరీ’ సామాజిక న్యాయం

కుల సంఘాలు పెట్టి పదవి, డబ్బు వెనకేసుకుంటున్న ఈ కాలంలో కర్పూరీ ఠాకూర్​ దూరదృష్టి ఎంత గొప్పదో ఆయన జీవితం చూస్తే అర్థం అవుతుంది. ‘సామాజిక న్యాయం’ అంటూనే అదే సమాజంపై ఆధిపత్యం చెలాయిస్తున్న వ్యవస్థ ఇది. కానీ సామాజిక న్యాయాన్ని సాహూ మహరాజ్​లా త్రికరణ శుద్ధితో అమలు చేసిన కర్పూరీ ఠాకూర్​కు భారత బడుగు వర్గాలన్నీ  రుణపడి ఉన్నాయి. తను  నమ్మిన సోషలిస్ట్​ సిద్ధాంతాలను  ఆచరణలో చూపించాడు.  నిష్పాక్షికంగా సమానంగా అందరికీ సామాజిక దృక్పథంలో ఫలాలను అందించాడు. అంతగొప్ప వ్యక్తిత్వం కలవాడు కాబట్టే ఆ కాలం రాజకీయాల్లో జేపీని లోక్​నాయక్​ అని పిలిస్తే కర్పూరీ ఠాకూర్​ను ‘జన నాయక్’ అని పిలిచారు. 1970లో బిహార్​లో మద్యపాన నిషేధం చేశాడు. వ్యవస్థాగత అసమానతల కోసం విద్య అందరికీ ఉండాలని ఠాకూర్​ ఆశించారు. ఉచిత విద్య అనేది సంకల్పించిన అతికొద్దిమంది నాయకుల్లో ఆయన ఒకరు. సమాజంలో శ్రమను ధారపోసే సన్నకారు రైతులు, కార్మికులు, యువశక్తిని ఆయన గుర్తించి వారు అసెంబ్లీకి వెళ్లాలని ఆశించాడు. కర్పూరీ బిహార్లో బీసీలకు కొత్త విద్యాలయాలు, హాస్టళ్లు తెరిచాడు. మొదట్లో టీచర్​గా పనిచేసిన ఠాకూర్​ తాను జయప్రకాశ్​ నారాయణ్​కు శిష్యుడై ఎందరో నాయకులకు గురుస్థానం పొందాడు. బీసీలను నాయకులను చేయడమేగాక బీసీలకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా ఆయనదే. 

- డా. పీ. భాస్కర యోగి, పొలిటికల్​, సోషల్​ ఎనలిస్ట్​