కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోండి

కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోండి

దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.కరోనా పరీక్షలు వేగవంతం చేయాలని..కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 7,240 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో 81 శాతం కేసులు మహారాష్ట్ర,ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి.రోజువారీ పాజిటివిటీ రేటు 0.63 శాతం నుంచి 1.12 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ కేసులను ముందస్తుగా గుర్తించడంతో  వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. కోవిడ్ ప్రోటోకాల్ ను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. కోవిడ్ క్లస్టర్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.