పెద్దపల్లిలో ఇర్రాడియేషన్‌‌‌‌ సౌకర్యానికి ప్రత్యేక నిధుల కేటాయింపుల్లేవ్

పెద్దపల్లిలో ఇర్రాడియేషన్‌‌‌‌ సౌకర్యానికి  ప్రత్యేక నిధుల కేటాయింపుల్లేవ్
  • ఎంపీ గడ్డం వంశీకృష్ణకుకేంద్ర మంత్రి జవాబు

న్యూఢిల్లీ, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో పండ్లు, కూరగాయలు, పాలు, గుడ్ల వంటి వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, నిల్వకాలం పెంచేందుకు ఇర్రాడియేషన్‌‌‌‌ సౌకర్యానికి ప్రత్యేక నిధుల కేటాయింపులు లేవని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం లోక్‌‌‌‌సభలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార ప్రాసెసింగ్‌‌‌‌ శాఖ సహాయ మంత్రి రవనీత్‌‌‌‌  సింగ్‌‌‌‌ ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చా రు. 

ప్రధాన మంత్రి కిసాన్‌‌‌‌ సంపద యోజనలో భాగంగా ఉన్న కోల్డ్‌‌‌‌ చైన్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ కిందే ఇలాంటి సౌకర్యాలకు ఆర్థిక సహాయం అందిస్తామని ఆయ న తెలిపారు. ఈ పథకం కింద సాధారణ ప్రాంతాల్లో ప్రాజెక్టు ఖర్చు 35 %, కష్టతర ప్రాంతాల్లో 50 % వరకు సబ్సిడీ లభిస్తుందని, గరిష్టంగా రూ.10 కోట్ల వరకు మంజూరు చేస్తామన్నారు. అయితే, ఈ స్కీమ్  డిమాండ్‌‌‌‌ ఆధారంగా నడుస్తుండటంతో రాష్ట్రం లేదా జిల్లా వారీగా ప్రత్యేక నిధుల కేటాయింపు లేదన్నారు.