వెల్డన్ జీహెచ్ఎంసీ..వెక్టర్ బోర్న్ డిసీజెస్ కట్టడి చర్యలకు కేంద్రం ప్రశంస

వెల్డన్ జీహెచ్ఎంసీ..వెక్టర్ బోర్న్ డిసీజెస్ కట్టడి చర్యలకు కేంద్రం ప్రశంస
  • వెక్టర్ బోర్న్ డిసీజెస్ కట్టడి చర్యలకు కేంద్రం ప్రశంస
  • నాగ్​పూర్​లో కమిషనర్​ కర్ణన్​  ప్రజంటేషన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: దోమల ద్వారా వ్యాపించే వెక్టర్ బోర్న్ డిసీజెస్ ను అరికట్టడంలో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలను కేంద్రం ప్రశంసించింది. మంగళవారం నాగ్​పూర్​లో నిర్వహించిన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్స్ ( ఎంఎస్​యూ) జాతీయ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలకు కేంద్ర అధికారులు కితాబునిచ్చారు. కీటకజనిత వ్యాధుల నియంత్రణలో జీహెచ్ఎంసీ అనుసరిస్తున్న విధానం ఇతర నగరాలకు ఆదర్శనీయమన్నారు.

దోమలు సహా కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణలో హైదరాబాద్‌‌ సాధించిన పురోగతికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఈ మీటింగ్​కు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వెక్టర్ బోర్న్ డిసీజెస్ అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై  కమిషనర్ ఆర్వీ కర్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2025లో డెంగ్యూ కేసులను ఎలా తగ్గించామో వివరిస్తూ టెక్నాలజీ డ్రైవెన్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ సర్వైలెన్స్ అండ్ మేనేజ్మెంట్, డెంగ్యూ కంట్రోల్ సక్సెస్ స్టోరీ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

వెక్టర్ బోర్న్ డిసీజెస్ యాప్ ద్వారా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. జీఐఎస్ ఆధారిత డ్యాష్‌‌ బోర్డులు, రియల్‌‌ టైమ్ డేటా అప్​డేట్స్‌‌తో ఫీల్డ్​లెవెల్​లో చర్యలు తీసుకోవడంతో ఇది సాధ్యమైందన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డేటా ఆధారిత విధానం, శాఖల మధ్య సమన్వయంతో చేపట్టిన చర్యలను వివరించారు.