V6 News

ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సర్వే.. స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సర్వే.. స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ఎయిర్​పోర్ట్​ నిర్మాణానికి సంబంధించి ఓఎల్ఎస్ సర్వే కోసం కేంద్ర రక్షణ, పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికారులు, ఎయిర్​పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ ఇండియా అధికారులు శుక్రవారం విమానాశ్రయ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా అధికారులతో ఇన్​చార్జ్​ కలెక్టర్​ యువరాజ్​మర్మట్, ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ మాట్లాడారు. ఆదిలాబాద్​లో ఎయిర్​పోర్ట్ నిర్మాణం కోసం అనుకూలతలపై సర్వేను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీలో జరిగే తదుపరి సమావేశంలో ఈ ప్రాజెక్టుపై మరింత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.