పాన్, ఆధార్  అనుసంధానికి మరో ఆరు నెలలు

V6 Velugu Posted on Sep 18, 2021

ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌లో తలెత్తిన సమస్యలతో కొద్ది రోజులుగా  ట్యాక్స్ చెల్లించే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు.  వీటిని  దృష్టిలో ఉంచుకొని ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది.  పాన్ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని కేం‍ద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేసే గడువు 2022 మార్చి 31. పాన్‌ కార్డును ఆదార్‌కార్డుతో లింక్‌ చేసే గడువును పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకటించింది. ట్యాక్స్ పేయర్లకు  కాస్త రిలీఫ్  లభించనుంది. 

అయితే..పాన్‌ కార్డును, ఆధార్‌తో అనుసంధాన గడువు పొడిగించడం ఇది నాలుగో సారి. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. కొత్త నిబందనల ప్రకారం ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాన్‌-ఆధార్‌ లింకింగ్  పొడగింపు నిర్ణయంతో పాటు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కరోనా ట్రీట్మెంట్ కు  కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కూడా కేంద్రం తెలిపింది. 

 

Tagged Centre, extends deadline, Aadhaar, PAN, 6 months

Latest Videos

Subscribe Now

More News