- డీఫాల్ట్ గా అందించాలని మొబైల్ కంపెనీలకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: దేశంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తయారయ్యే కొత్త ఫోన్లలో తప్పనిసరిగా సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ ని డీఫాల్ట్ గా అందించాలని సూచించింది.
ఈ యాప్ ఇన్ స్టలేషన్ అమలుకు 90 రోజుల గడువు ఇచ్చినట్టు పేర్కొంది. దీన్ని డిలీట్ చేయడం కుదరదు. ఇప్పటికే సప్లయ్ చైన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు సాఫ్ట్ వేర్ అప్ డేట్ ద్వారా ఈ యాప్ ను అందించాలని సూచించినట్టు తెలుస్తోంది.
