ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం జవాబు

ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం జవాబు

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది బియ్యం సేకరణ ప్రక్రియను అక్టోబర్‌‌ నుంచి ప్రారంభిస్తామని కేంద్రం తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి సమాధానమిచ్చారు. తెలంగాణలో 2021–22 రబీ పంట దిగుబడిలో బియ్యం సేకరణ ఆగలేదని ఆమె స్పష్టం చేశారు. 

ప్రధాన మంత్రి గరీబ్‌‌ కళ్యాణ్‌‌ అన్న యోజన 6వ దశ కింద రాష్ట్రంలో బియ్యం పంపిణీ చేయకపోవడం, అవకతవకలకు పాల్పడిన రైస్ మిల్లులపై చర్యలు తీసుకోకపోవడం వల్ల తెలంగాణలో బియ్యం సేకరణ ప్రక్రియ జూన్‌‌ 7 నుంచి జూలై 19వ తేదీ వరకు నిలిపివేశామని వివరించారు. పీఎంజీకేఏవై బియ్యాన్ని పంపిణీ చేస్తామని రాష్ట్ర సర్కార్ అంగీకరించాక.. బియ్యం సేకరణ ప్రక్రియను జులై 20 నుంచి పునరుద్ధరించామని వెల్లడించారు. తెలంగాణలో 2014–15 నుంచి 2021–22 వరకు 4.23 కోట్ల మెట్రిక్‌‌ టన్నుల బియ్యాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు.