2 కోట్ల ఎన్‌95 మాస్కులు, కోటి పీపీఈ కిట్స్‌ను ఫ్రీగా అందించాం

2 కోట్ల ఎన్‌95 మాస్కులు, కోటి పీపీఈ కిట్స్‌ను ఫ్రీగా అందించాం

మాస్కులు, పీపీఈ కిట్స్, వెంటిలేటర్ల వివరాలు తెలిపిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా దేశం మొత్తం మీద పంపిణీ చేసిన మాస్కులు, పీపీఈ కిట్‌లు, వెంటిలేటర్‌‌ల వివరాలను కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు 2.02 కోట్ల ఎన్‌95 మాస్కులు, 1.18 కోట్లకు పైచిలుకు పీపీఈ కిట్స్‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు ఉచితంగా పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. వీటితోపాటు 6.12 కోట్ల హైడ్రాక్సీక్లోరోక్విన్ ట్లాబ్లెట్‌లు, మేక్‌ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశంలో తయారు చేసిన 11,300 వెంటిలేటర్స్‌ను కూడా అందించినట్లు చెప్పింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 7.81 లక్షల పీపీఈ కిట్స్, 12.76 లక్షల ఎన్‌95 మాస్కులను సప్లయి చేశామని తెలిపింది. అలాగే కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో11.78 లక్షల పీపీఈ కిట్స్, 20.64 లక్షల ఎన్‌95 మాస్కులు.. తమిళనాడులో 5.39 లక్షల పీపీఈలు, 9.81 లక్షల మాస్కులను అందించామని యూనియన్ హెల్త్ మినిస్ట్రీ పేర్కొంది.