
పంజాబ్ తరహాలోనే తెలంగాణలోనూ కేంద్రం ధాన్యం కొంటుందన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. ఇప్పటి వరకు 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలుపై రెండు ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అర్వింద్ మండి పడ్డారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు 600శాతం పెరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రైతులను నుంచి ధాన్యాన్ని కొని.. కేంద్రానికి ఇవ్వాలన్నారు.