
ఈటెల రాజేందర్ దళిత బంధు ఆపాలని లేఖ రాసినట్టు సృష్టించిన ఆర్టీఐ ఫేక్ లెటర్ పై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎలక్షన్ కమిషన్‌లో అసలు గురుప్రీత్ సింగ్ అనే అధికారి ఎవరు లేరని తెలిపింది ఎన్నికల సంఘం. ఫేక్ లెటర్ సృష్టించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం.