బంగారమే శాలరీ!

బంగారమే శాలరీ!
  • డబ్బులకు బదులు గోల్డ్ ఇస్తామంటున్న ఓ కంపెనీ సీఈఓ
  • కరెన్సీ వాల్యూ తగ్గుతోందని, గోల్డే మంచిదని వెల్లడి

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఉద్యోగులకు శాలరీ కింద డబ్బులు ఇవ్వడానికి బదులు బంగారం ఇస్తానంటున్నాడు లండన్‌‌‌‌కు చెందిన ఓ కంపెనీ సీఈఓ. తన కంపెనీలోని సీనియర్ స్టాఫ్ మెంబర్లకు ఇప్పటికే గోల్డ్‌‌‌‌లో  శాలరీ ఇస్తున్నామని, త్వరలో ఉద్యోగులందరికీ ఈ స్కీమ్‌‌‌‌ అమలు చేస్తామని ఆయన చెప్పారు. లండన్‌‌‌‌కు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ టాలీమనీ ఈ కొత్త స్కీమ్‌‌‌‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కరెన్సీ వాల్యూ రోజు రోజుకీ మారుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. పెరుగుతున్న ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ను తట్టుకోవడానికి గోల్డ్‌‌‌‌ సాయపడుతుందని  టాలీమనీ సీఈఓ కేమరన్‌‌‌‌ పారీ అన్నారు. ‘ ట్రెడిషనల్ మనీ వాల్యూ రోజు రోజుకీ తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ కంటే ముందుండడంలో గోల్డ్‌‌‌‌ సాయపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. యూకే కరెన్సీ పౌండ్ వాల్యూ వేగంగా తగ్గిపోతోందని, గోల్డ్ వాల్యూ మాత్రం పెరుగుతోందని చెప్పారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ అధ్వాన్నంగా తయారవుతోందని కేమరన్ పేర్కొన్నారు. పౌండ్స్‌‌‌‌ వాల్యూ రోజులు గడిచే కొద్దీ తగ్గుతోందని,  అందుకే పౌండ్స్‌‌‌‌లో శాలరీ హైక్‌‌‌‌లను ఇవ్వడంలో ఎటువంటి అర్థం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది  గాయానికి బ్యాండ్ ఎయిడ్‌‌‌‌ అతికించినట్టే ఉంటుందని  అన్నారు. ప్రస్తుతం టాలీమనీలో 20 మంది పనిచేస్తున్నారు. సీఈఓ కెమరన్ సైతం గోల్డ్‌‌లోనే శాలరీ తీసుకుంటున్నారు. కాగా, ఈ కంపెనీ ఉద్యోగులు మాత్రం పౌండ్లలోనే శాలరీని అందుకునేందుకు మొగ్గు చూపుతున్నారని యూకే మీడియా పేర్కొంది.