
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సీహెచ్ కనకచంద్రం ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్లో అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర కొత్త కమిటీని ఎన్నుకున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా శేఖర్, అసోసియేట్ ప్రెసిడెంట్గా కొండల్, వర్కింగ్ ప్రెసిడెంట్గా నర్సింహా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సిద్ధారెడ్డి, ప్రచార కార్యదర్శిగా నాగేందర్, అధికార ప్రతినిధిగా నంట శ్రీనివాస్ రెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీగా పవన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నేతలు ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన స్టేట్ ప్రెసిడెంట్ కనక చంద్రం మాట్లాడారు. కాలేజీల్లోని లెక్చరర్ల సమస్యలను పరిష్కరించేందుకు, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సర్కారు కాలేజీల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కాగా, కొత్త కార్యవర్గానికి మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు.