బ్రహ్మయోగం.. సింహరాశి.. కుంభలగ్నం.. : అమృత కాలంలో చంద్రయాన్ 3 విజయవంతం

బ్రహ్మయోగం.. సింహరాశి.. కుంభలగ్నం.. : అమృత కాలంలో చంద్రయాన్ 3 విజయవంతం

చంద్రయాన్ 3 విజయవంతం వెనక పెద్ద ఆధ్యాత్మికతే ఉంది. ఇస్రో ఏ పని మొదలుపెట్టినా తిరుమల వేంకటేశ్వరస్వామితోపాటు చాలా దేవాలయాల్లో పూజలు చేస్తుంది. అంతేకాదు.. మంచి ముహూర్తం చూసుకుని ప్రయోగాలు చేస్తుంది. చంద్రయాన్ 3 విషయంలోనూ ఇదే సెంటిమెంట్ ఫాలో అయ్యింది. చంద్రయాన్ 3.. చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యే సమయం ఏంటో తెలుసా.. అమృతకాలం.. అవును.. ఈ అమృత కాలంలోనే చంద్రయాన్ 3 ప్రయోగం సాగింది. అదెలాగో చూద్దాం..

2023, ఆగస్ట్ 23వ తేదీ సాయంత్రం 4 గంటల 48 నిమిషాల నుంచి 6 గంటల 23 నిమిషాల వరకు అమృత కాలం నడిచింది. సరిగ్గా ఈ అమృత కాలంలోనే చంద్రయాన్ 3.. చంద్రుడిపై దిగే సమయం కూడా ఇదే కావటం విశేషం. 5 గంటల 51 నిమిషాల నుంచి 6 గంటల 4 నిమిషాల మధ్య.. దివ్యమైన అమృతకాలం నడిచింది. ఈ టైంలోనే చంద్రయాన్ 3.. చంద్రుడిపై విజయవంతంగా దిగింది. 

ఆగస్ట్ 23వ తేదీ బుధవారం రాత్రి 8 గంటల 5 నిమిషాల నుంచి 9 గంటల 43 నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంది. సరిగ్గా ఈ టైంలోనే విక్రం రోవర్ చంద్రుడిపైకి వస్తుంది. రెండో లక్ష్యం కూడా అమృతకాలంలోనే జరగటం విశేషం.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం 2023, ఆగస్ట్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు కుంభ రాశి గడియలు ప్రవేశించాయి.  అంటే కుంభరాశి గడియలు ప్రవేశించిన నాలుగు నిమిషాలకే  చంద్రునిపై విక్రమ్​ ల్యాండ్​ అయింది.  సహజంగా కుంభరాశి సమయంలో ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుందని  పండితులు చెబుతున్నారు.  విక్రమ్​పేరుతో ల్యాండ్​ అయ్యే చంద్రయాన్​ 3 విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు దాని గమ్యాన్ని చేరుకునేలా ఇస్రో శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు.  సప్తమి బుధవారం.. విశాఖ నక్షత్రం.. కుంభలగ్నం..  విక్రమ్ పేరుతో ఏ పని  చేసినా  తిరుగుందడని పండితులు చెబుతుంటారు.

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, చంద్రుడు కుంభలగ్నంలో ఉన్న  ఈ సమయంలో అనేక శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ సమయంలోనే 23 ఆగస్టు 2023 బుధవారం రోజున విశాఖ నక్షత్రంలో బ్రహ్మ యోగం ఏర్పడింది. జ్యోతిష్యం ప్రకారం, ఈ యోగం అత్యంత శుభకరమైనది. ఈ రోజంతా విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. విశాఖ నక్షత్రం అంటే చాలా పవర్​ ఫుల్.  మరి విక్రమ్ పేరుకు సరిపడే విశాఖ నక్షత్రంలో ​ ల్యాండింగ్​అంటే..  ఎంత పవర్​ ఫుల్​వేరే చెప్పనక్కరలేదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.  ఇదిలా ఉండగా  జ్యోతిష్యం ప్రకారం, బుధవారం రోజున బుధ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  బుధుడు సంచారం చేసే విజయాలను కలుగజేయడంలో కీలకపాత్ర పోషిస్తాడు.  ఇదే సమయంలో విశాఖ నక్షత్రంలో బ్రహ్మయోగం ఏర్పడటంతో  అనుకున్న పని విజయంవంతం అవుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు.