ఏటీఎంలో డబ్బే కాదు.. ఛాయ్ కూడా తీసుకోవచ్చు.. ఎక్కడంటే

ఏటీఎంలో డబ్బే కాదు.. ఛాయ్ కూడా తీసుకోవచ్చు.. ఎక్కడంటే

జనాలు నిద్ర లేస్తూనే టీ ఎక్కడుందా.. అని వెతుక్కుంటారు. కొంతమంది టీ వాసన తగలినదే దుప్పటి తీయరు.   టీ  తాగకపోతే చాలామందికి డే మొదలుకాదు.  గంట గంటకు  టీ తాగే వారు కూడా ఉన్నారు.  కుటుంబంతో కలిసి ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ పెట్టుకొని తాగవచ్చు.  కాని బ్యాచిలర్స్ అయితే టీ డబ్బా దగ్గరకు వెళ్లాల్సిందే.. ఒక్కోసారి అక్కడ ఉండక పోతే మరో టీ దుకాణం ఎతుక్కుంటూ పోవాలి.  అక్కడ టీమాస్టర్ ఛాయ్ ఇచ్చేదాకా వేచి చూసి ఆ తరువాత తాగాలి.  అయితే ఇక ఇప్పుడు అలా వేచి చూడక్కరలేదు.  హైదరాబాద్ లో ఛాయ్ ఏటీఎం లు వచ్చేశాయి.  

చాయ్ ప్రేమికులు చాలామంది ఉంటారు. డే మొత్తంలో చాయ్ తాగని వారు ఉండరు. బయటకు వెళ్తే కూడా చాయ్ తాగడానికి ఇష్టపడేవారు ఉంటారు. అలాంటి వారి కోసం హైదరాబాద్‌లో చాయ్ ఏటీఎం వెలిసింది. ఎల్బీనగర్‌లోని ఎల్.పి.టి మార్కెట్ దగ్గర వెలిసిన ఈ చాయ్ ఏటీఎం ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటోంది.

ఇండియాలో 64 శాతం మంది టీ తాగేందుకే ఇష్టపడుతున్నారట.  చాయ్ లవర్స్ ముఖ్యంగా హైదరాబాదీలకు గుడ్ న్యూస్. ఇప్పుడు చాయ్ ఏటీఎంలు వెలుస్తున్నాయి. ఈ చాయ్ ఏటీఎం 24/7 అందుబాటులో ఉంటుంది. ఇక్కడ స్కాన్ చేయగానే చాయ్ గ్లాసులో పడిపోతుంది. అంతేనా? లెమన్ టీ, బాదాం టీ, కాఫీ, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ఏవైనా సరే జస్ట్ స్కాన్ చేస్తే చాలు చేతిలోకి వచ్చేస్తాయి. సోషల్ మీడియాలో ఈ చాయ్ ఏటీఎం వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఏరియాలో ఆల్రెడీ ఉన్నవారు.. ఆ ఏరియావైపు వెళ్తున్నవారు మరీ ముఖ్యంగా టీ లవర్స్ ఓ సారి ఈ ఏటీఎంని సందర్శించండి. ఇక్కడి చాయ్ చాలా టేస్టీగా ఉందని రుచి చూసిన వారు చెబుతున్నారు.