బెండాలపాడులో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే ఆది నారాయణ

బెండాలపాడులో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి : ఎమ్మెల్యే ఆది నారాయణ
  • ఎమ్మెల్యే ఆది నారాయణ 

చంద్రుగొండ, వెలుగు: చంద్రుగొండ మండలంలోని  బెండాలపాడులో మౌలిక వసతుల కల్పనకు ఆఫీసర్లు కృషి చేయాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు.  బెండాలపాడులో  కలెక్టర్​జితేశ్ వి. పాటిల్ తో కలిసి ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు కలర్స్​ వేయించాలన్నారు.

 లోగోను ఇందిరమ్మ ఇండ్లపై వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.  గృహ ప్రవేశాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న పైలాన్​ను సుందరంగా నిర్మించాలన్నారు. ప్రోగ్రాంలో అడిషనల్​కలెక్టర్​డి.వేణుగోపాల్, హౌసింగ్​ సీఈ చైతన్య కుమార్, ఆర్డీఓ మధు, హౌసింగ్​పీడీ రవీంద్రనాథ్​, తహసీల్దార్​ సంధ్యారాణి, టీపీసీసీ జనరల్​సెక్రటరీ నాగ సీతారాములు, కాంగ్రెస్​ నేతలు కోనేరు సత్యనారాయణ, భోజ్యా నాయక్, సురేశ్ పాల్గొన్నారు.