24 గంటల వ్యవధిలో మూడు చోట్ల చైన్ స్నాచింగ్

24 గంటల వ్యవధిలో మూడు చోట్ల చైన్ స్నాచింగ్

హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ టాప్ కాలనీకి వెళ్లే దారిలో  స్నాచర్లు బీభత్సం సృష్టించారు. క్యాబ్ కోసం వేచి ఉన్న మహిళపై దాడి చేసి...ఆమె మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. పల్సర్ బైక్పై వచ్చిన ఓ వ్యక్తి మహిళ మెడలో నుంచి మూడు తులాల  చైన్ను అపహరించాడు.

మూడు చోట్ల స్నాచింగ్...
హైదరాబాద్లో మరో రెండు చోట్ల చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గోల్కొండ, హుమాయూన్ నగర్లో దొంగలు మహిళల మెడలో నుంచి గొలుసులను లాక్కెళ్లారు. ఒంటరి మహిళలనే టార్గెట్ చేసిన స్నాచర్లు..అదును చూసి మెడలో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. గత 24 గంటల్లో హైదరాబాద్లో మూడు చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.