చేవెళ్లలో ఈవెనింగ్ మార్కెట్ ఫ్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

చేవెళ్లలో ఈవెనింగ్ మార్కెట్ ఫ్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్
  •     ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట రంగారెడ్డి
     

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సాయంకాల మార్కెట్​ను కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కూరగాయల అమ్మకాలు జరుగుతాయన్నారు. ఇక్కడి రైతులు తాము పండించిన కూరగాయలను అమ్ముకునేందుకు రాత్రివేళల్లో సిటీలోని గుడిమల్కాపూర్, బోయిన్​పల్లి మార్కెట్లకు వెళ్లాల్సి వస్తోందన్నారు. 

ఈ ఇబ్బందులను గుర్తించి స్థానికంగా ఈవెనింగ్ మార్కెట్​ను ప్రారంభించామన్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి చాయాదేవి, అపర్ణ, మార్కెట్ సెక్రటరీ మహేందర్, వైస్ చైర్మన్ నర్సింలు, సర్పంచ్ శైలజ, సొసైటీ చైర్మన్ వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.