నందమూరి ఫ్యామిలీ నుంచి తెరపైకి మరో హీరో

నందమూరి ఫ్యామిలీ నుంచి తెరపైకి మరో హీరో

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌లు హీరోలుగా ఓ ఇమేజ్‭ని క్రియేట్ చేసుకున్నారు. నటనలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో నందమూరి వారసుడు కూడా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. నందమూరి జయకృష్ణ కొడుకు అయిన నందమూరి చైతన్య కృష్ణ వెండితెరకు పరిచయం కానున్నారు. బసవతారకం క్రియేషన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన హీరోగా పరిచయం కానున్నారు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్‌ను మార్చి 5న విడుదల చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

నందమూరి వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ మొదట సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా.. ఆ తర్వాత తరంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సినీ రంగ ప్రవేశం చేశారు. ఇప్పుడు నందమూరి కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా నందమూరి చైతన్య కృష్ణ సినీ హరోగా పరిచయం కానున్నారు. తన అన్నయ్య కుమారుడు హీరోగా విజయవంతం కావాలని బాలకృష్ణ ఆశీర్వదించారు. తారకరత్న మరణాన్ని అభిమానులు జీర్ణించుకోక ముందే.. నందమూరి ఫ్యామిలీ నుంచి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. నందమూరి వారసుడు చైతన్య కృష్ణ హీరోగా పరిచయం కాబోతున్నారని ప్రకటించారు.