కాంగ్రెస్ నాయకులు బీజేపీ గెలుపు కోసం పని చేశారు

V6 Velugu Posted on Dec 06, 2021

కరీంనగర్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మినర్సింహరావు రాజీనామా చేశారు. తన రాజీనామాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్లు తెలిపారు. రెండున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశానన్న ఆయన.. అంతర్గత కుట్రలతో ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున నాకు కరీంనగర్ నుంచి  మూడు సార్లు  పోటీ చేసే అవకాశం ఇచ్చారని, కానీ తన పార్టీ వాళ్లే ప్రత్యర్థి పార్టీతో కలిసి ఓడగొట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆందోళనకరంగా ఉందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ ముందుకు వెళ్తుందనుకున్నాం, కానీ నాయకులకు చిత్తశుద్ధి లేదని చల్మెడ అన్నారు. హుజురాబాద్ ఎలక్షన్ లో  కాంగ్రెస్ నాయకులు బీజేపీ గెలుపు కోసం పని చేశారని ఆయన ఆరోపించారు. ఎటువంటి కండీషన్ లేకుండా ఈ నెల 8న టీఆర్ఎస్ లో చేరుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

Tagged TRS, Telangana, Karimnagar, Congress, Revanth reddy, Sonia Gandhi, chalmeda lakshmi narasimha rao

Latest Videos

Subscribe Now

More News