20న ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు

20న ఉద్యమకారుల  ఆత్మగౌరవ సదస్సు

ముషీరాబాద్, వెలుగు: ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పేరిట 'చలో ఇందిరా పార్క్' నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలిపింది. ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చలో ఇందిరా పార్క్ పోస్టర్ ను ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్  ఆవిష్కరించి మాట్లాడారు. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ ఉద్యమంలో అనేక మంది తమ ఉపాధిని, ఫ్యామిలీని వదిలిపెట్టి పోరాడారని శ్రీనివాస్ తెలిపారు. కానీ ప్రస్తుతమున్న రాష్ట్ర ప్రభుత్వం పదేండ్లుగా ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.